పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయం
– రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్ ఆసుపత్రుల తనిఖీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా వైద్యులు విధులు నిర్వహించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

ఆదివారం తాండూరు పట్టణంలోని మాతశిశు ఆసుపత్రితో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తనిఖీ చేశారు. ఆయా ఆసుపత్రులలో పలు విభాగాలను సందర్శించారు. ఆసుపత్రిలలో చికిత్స పొందుతుడున్న పేదలను పలకరించి అమ్మా ఆస్పత్రి ఎలా ఉంది? వైద్య సేవలు సక్రమంగా అందిస్తున్నారా..? లేదా, భోజనం పెడుతున్నారా..? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని అన్నారు. అంతకుముందు ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. ఆసుపత్రులకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డాక్టర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పేదల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేయాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలి అని అన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, ఏఏంసి చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు, వైస్ ఛైర్మన్ అబ్దుల్ రజాక్, ఆస్పత్రి సూపరిండెంట్ వినయ్ కుమార్, డాక్టర్లు అనిల్, ఆనంద్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


