అక్రమ కేసులకు భయపడేది లేదు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అక్రమ కేసులకు భయపడేది లేదు
– బీఆర్ఎస్ కక్ష్య సాధింపులు ఎన్నటికి సాగవు
– కోర్టుకు హాజరైన తాండూరు కాంగ్రెస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని తాండూరు కాంగ్రెస్ నేతలు అన్నారు.

మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు బాతుల వెంకటయ్య తదితరులు తాండూరు న్యాయస్థానానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం జరిగిందని తెలిపారు.

అప్పట్లో ధరల పెంపుపై దర్నాలు చేపట్టగా తమపై కేసులు నమోదు అయిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందులో భాగంగా తమపై నమోదైన కేసులపై విచారణ కోసం కోర్టులో హాజరైనట్లు వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై కక్ష్య గట్టి కేసులు నమోదు చేసిందని ఆరోపించారు.

తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూసినా బెదిరేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రజల అండ దండలతో వారి సమస్యలు, సంక్షేమానికి పోరాటానికి సిద్దంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాతుల భీం శంకర్, జోగుల ఎబినేజర్ తదితరులు ఉన్నారు.

దొరికిన బంగారం దొంగ..!