మా వార్డును అభివృద్ధి చెయ్యరంటా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మా వార్డును అభివృద్ధి చెయ్యరంటా..!
– బీఆర్ఎస్ వార్డులపై నియంత పాలన
– రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ ఆక్రోశం
తాండూరు,  :  మున్సిపల్ పరిధిలో ఉన్న మా వార్డును అభివృద్ధి చెయ్యమని అంటున్నారని బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావీద్ ఆరోపించారు.

బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాన్సిల్ సమావేశం విషయంలో చైర్ పర్సన్ తో భేటీ అయినట్లు తెలిపారు. ఈ క్రమంలో 8వ వార్డు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధి గురించి చర్చించగా చైర్ పర్సన్ సానుకూలంగా స్పందించలేదని తెలిపారు.

పైగా వార్డు నుంచి మున్సిపల్ కు ఉపయోగం లేదని అన్నారని ఆరోపించారు. ఈ కారణంగా వార్డును అభివృద్ధి చెయ్యమని అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ల వార్డులపై నియంత పాలన చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేస్తే వార్డు ప్రజలతో ఇంటి వద్ద ఆందోళనలు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు.

ఏకపక్షంగా ఎస్ఐఆర్ నమోదు..!