కోడంగల్‌ తరువాత.. తాండూరుకే అధిక ప్రాధాన్యం..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

కోడంగల్‌ తరువాత.. తాండూరుకే అధిక ప్రాధాన్యం..!
– రూ. 900ల కోట్లతో జిల్లాలోని రోడ్ల అభివృద్ధి
– సంక్షేమ పథకాలతో పేదల అభ్యున్నతికి కృషి
– ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
– 70వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే
– తాండూరులో అండర్ గ్రౌండ్‌ డ్రైనేజీకి నిధులిస్తాం
– జిల్లా ఇంచార్జ్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
– తాండూరులో రూ. 340 కోట్ల హ్యామ్ పనులకు శంకుస్థాపనలు
– బైపాస్ భూ నిర్వాసితులకు పరిహారం చెక్కులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కోడంగల్‌ తరువాత జిల్లాలోని తాండూరు నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో హ్యామ్ ప్రాజెక్టు కింద రూ. 340 కోట్లతో చేపట్టే రోడ్ల నిర్మాణ పనులకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు.

ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కందనెల్లి జీపీఆర్ గార్డెన్ లో తాండూరు బైపాస్ భూ నిర్వాసితులకు మంజూరైన రూ. 25 కోట్ల పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. తరువాత జరిగిన ప్రగతి సభలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగించారు. అభివృద్ధిలో కోడంగల్‌ తరువాత తాండూరుకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో రూ. 900 కోట్లతో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. తాజాగా తాండూరు నియోజకవర్గానికి 290 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

అదేవిధంగా ప్రజా పాలన లో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హుడైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. 500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే 900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచే దిశగా యంగ్ ఇండియా పాఠశాలలను స్థాపించడం జరుగుతుందని మంత్రి అన్నారు. కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే 94 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ వే బ్రిడ్జి పనులను 18 వారాల్లో చేపడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయలను మాఫీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు నిర్వహించి 70 వేల మందికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించదని మందు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తూనే ఉదయం అల్పాహారం సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఆయన అన్నారు.

తాండూరులో కాగ్న నదిలో మురుగునీరు కలవకుండా 30 కోట్లను మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం జరిగిందని మంత్రి అన్నారు. మున్సిపల్ పరిధిలో 571 మంది అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడం జరుగుతుందని అన్నారు. అంతర్గత మురుగు కాలువల సమస్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తే అనుమతులు ఇస్తామని మంత్రి అన్నారు. తెలంగాణ చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం పేదల అభ్యున్నతి కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేయబడుతుందన్నారు. వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు ఇచ్చారని గుర్తుచేశారు. కర్ణాటక సరిహద్దు రోడ్లకు నిధులను కేటాయించి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం సహాకారంతో అధిక నిధులను తీసుకురావడం జరుగుతుందన్నారు. కోట్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేసి.. రైతులకు మేలు జరిగేలా చూస్తామన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం 75 కోట్ల వ్యయంతో ఏటీసీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గత సంవత్సరం 165 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.

బషీరాబాద్ రోడ్ల అభివృద్ధియే కాకుండా 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కళాశాలలను మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఉమాశంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఇ.వెంకటాచారి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డిఓ అనిత, ఆర్ అండ్ బి ఎస్.ఇ వసంత నాయక్, ఆర్య వైశ్య కార్పొరేషన్ సంస్థ చైర్ పర్సన్ కల్వ సుజాత, డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కందనెల్లి సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్, జిల్లా అధికారులు, తాండూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మసూద్ కు ఎమ్మెల్యే పరామర్శ..!