చదువుతో యోగాను భాగం చేసుకోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

చదువుతో యోగాను భాగం చేసుకోవాలి
– బాల్యం నుంచే అలవాటతై ఆరోగ్యం
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– తెలంగాణ గురుకుల పాఠశాలో యోగా తరగతులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుతో పాటు యోగాను కూడా జీవితలో భాగం చేసుకోవాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.

బుధవారం తాండూరు పట్టణం ఖాంజాపూర్ గేటు సమీపంలో గల తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్‌లో యోగా తరగతులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి హాజరై యోగా తరగతులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాకరంతో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషితో తాండూరు గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

యోగాను కూడా భాగం చేసుకోవాలన్నారు. చదువు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాల వల్ల వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, యోగా గురువు ప్రవీణ్ సార్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

లక్ష్యం దిశగా ఎస్‌ఐఆర్‌