విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి
– తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
– కేవీసీఎస్‌లో అట్టహాసంగా ఇన్వెస్టిచర్ వేడుకలు
– జాతీయ స్థాయి ప్రతిభ విద్యార్థులకు సన్మానం
– ప్రమాణ స్వీకారంలో ఆకట్టుకున్న ప్రదర్శనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు.

శుక్రవారం తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవాలయంలోని క్రిష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్‌(కేవీసీఎస్‌)లో 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్వెస్టిచర్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు తాండూరు డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల హెడ్‌ బాయ్, హెడ్‌ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్‌ గర్ల్, కెప్టన్, వైస్ కెప్టన్లతో పాటు రెడ్‌, ఎల్లో, గ్రీన్, బ్లూ హౌస్‌ల ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జిలను ప్రదానం చేశారు. ఈ సందర్బంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ మంచి విలువలు, క్రమశిక్షణ, నిజాయితీతో సమాజానికి ఆదర్శప్రాయులుగా ఎదగాలని ఆయన సూచించారు. ప్రిన్సిపల్ ప్రశాంత్‌ మాట్లాడుతూ ఈ ఇన్వెస్టిచర్ కార్యక్రమం కేవలం బ్యాడ్జీలు, శాష్‌లు అందజేసే కార్యక్రమం మాత్రమే కాదు. బాధ్యత, నాయకత్వం, క్రమశిక్షణ, సేవాభావం, స్ఫూర్తిని విద్యార్థుల్లో పెంపొందించడమే లక్ష్యమని అన్నారు.

అదేవిధంగా స్పీడ్‌ ల్యాబ్స్ నిర్వహించిన ఐఐటీ,నీట్ ఎండ్ ఆఫ్ ఇయర్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రమశిక్షణతో నిర్వహించిన కవాతు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యజమాన్య కమిటి సభ్యులు వెంకటేశం, మల్లేపల్లి మల్లేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

అంబరాన్నింటిన బోనాల సంబరాలు..!