సస్పెండ్ చేసిన నేతకు సన్మానమా..?

తాండూరు రాజకీయం వికారాబాద్

సస్పెండ్ చేసిన నేతకు సన్మానమా..?
– బీఆర్ఎస్ పార్టీలో ఇదేం క్రమశిక్షణ
– కావలి సంతోష్ చిత్’కారు’పు విమర్శ
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్‌ఎస్‌ అధిష్టానం సస్పెన్షన్‌కు గురైన మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి తాండూరులో ఆ పార్టీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలకడంపై కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.

పార్టీ అధిష్టానం ఒకవైపు సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకుంటే.. అదే పార్టీకి చెందిన స్థానిక నాయకులు మరోవైపు ఘనంగా సన్మానించి స్వాగతం పలకడం ఇదేనా బీఆర్‌ఎస్‌ పార్టీ క్రమశిక్షణ అని ప్రశ్నించారు.

ఓ ప్రకటనలో కావలి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ లేదన్న విషయం తాజా ఘటనతో మరోసారి స్పష్టమైందని విమర్శించారు. డ్రగ్స్ వివాదంలో రోహిత్ రెడ్డిను పార్టీ అధిష్టానం సస్పెండ్‌ చేసినటీలు ఆ పార్టీ నాయకులే ప్రకటించారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడికి బీఆర్ఎస్ పార్టీ నాయకులే గజమాలతో స్వాగతం పలకడం ఏ విధమైన క్రమశిక్షణకు నిదర్శనమని ప్రశ్నించారు.

పార్టీ నిర్ణయాలకు విలువ లేకపోతే.. బీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే నాయకుల స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ నాయకులు ముందుగా తమ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. పార్టీ నిర్ణయాన్నే గౌరవించని నాయకులు భవిష్యత్తులో ప్రజల తీర్పును ఎలా గౌరవిస్తారని ఆయన ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.

పైలెట్ కు గ్రాండ్ వెల్ కమ్..!