తాండూరులో సదర్‌ జోష్‌…!

తాండూరు రాజకీయం వికారాబాద్

 తాండూరులో సదర్‌ జోష్‌…!
– యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు
– మొట్ట మొదటిసారిగా నిర్వహణ
– జయప్రదం చేయాలని సభ్యుల విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వివిధ ప్రాంతాలలో జరిగే సదర్ సంప్రదాయాన్ని తాండూరుకు పరిచయం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రేపు తాండూరు పట్టణంలో సదర్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ సహకారంతో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సదర్ జోష్‌ నింపేందుకు సిద్దం అయ్యారు. మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో సింధు డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్న అమ్మవారి గుడి నుండి బస్ స్టేషన్, ఇందిరా చౌక్, గంజ్, గాంధీ చౌక్, భద్రేశ్వర ఆలయం వరకు ఊరేగింపుగా కొనసాగుతుందని తెలిపారు.

తాండూరులో మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్న దున్న పొతుల పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. తాండూరులో నిర్వహిస్తున్న సదర్‌ ఉత్సవాలకు నియోజకవర్గంలోని యాదవ కుటుంబ సభ్యులు, ప్రజలు సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

చావునుంచి తప్పించుకున్నావ్ తల్లీ..!