రాకేష్ గురూజీకి డాక్టరేట్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రాకేష్ గురూజీకి డాక్టరేట్‌..!
– హోసూర్‌లో ఘనంగా సత్కారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాకు చెందిన రాకేష్ గురూజీకి అరుదైన గౌరవం లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ అవార్డును ప్రదానం చేశారు.

సద్గురు కోరసిద్ధేశ్వర మఠం, సిద్ధ టోటంద్ర శివాచార్యుల శిష్యుడైన రాకేష్ గురూజీ గత 12 సంవత్సరాలుగా అమ్మవారి సేవలో కొనసాగుతున్నారు. తన సొంత ఇంటిని శ్రీ భవాని శంకర్ మఠంగా మార్చి భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు.

ప్రతి మంగళవారం మఠానికి వచ్చే భక్తులకు అన్నదాసోహం నిర్వహిస్తూ, పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. ఆధ్యాత్మిక సేవతో పాటు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్న రాకేష్ గురూజీ సేవలను గుర్తించిన ఆసియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ అకాడమీ ఆయనకు డాక్టరేట్ అవార్డును అందజేసింది.

హోసూర్‌లో జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న రాకేష్ గురూజీ మాట్లాడుతూ.. తనకు లభించిన ఈ గౌరవాన్ని అమ్మవారి ఆశీస్సులుగా భావిస్తున్నానని తెలిపారు. భవిష్యత్‌లోనూ ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని పేర్కొన్నారు. రాకేష్ గురూజీకి డాక్టరేట్ అవార్డు లభించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

కాంగ్రెస్‌ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి