సాయినాథున్ని దర్శించుకున్న రాజుగౌడ్
– మందిరంలో పూజలు చేసిన గ్రంథాలయ చైర్మన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలో ఉన్న షిర్డీ సాయిబాబా మందిరంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ పూజలు నిర్వహించారు. శుక్రవారం ఆలయ కమిటి సభ్యుల పిలుపు మేరకు రాజుగౌడ్ షిర్డీ సాయిబాబా మందిరాన్ని సందర్శించారు. మందిరంలో సాయినాథున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటి సభ్యులు రాజుగౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా గౌరవం పెరిగిందన్నారు. ఆ గౌరవం ప్రతిష్ట పెంచేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు తదితరులు ఉన్నారు.


