శభాష్.. ఈర్షాద్ భాయ్..!
– విలియంమూన్ చౌరస్తా పేరు ఖరారుపై హర్షం
– కౌన్సిలర్‌ను సన్మానించిన స్కూల్ యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: శభాష్.. ఈర్షాద్ భాయ్ అంటూ తాండూరు మున్సిపల్ 7వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్‌ను అభినందించారు.

ఆయన వార్డులోని విలియంమూన్ హైస్కూల్ ఎదురుగా ఉన్న రోడ్డుకు విలియంమూన్ చౌరస్తాగా పేరు పెట్టేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం కౌన్సిలర్ ఈర్షాద్ చేసిన కృషిని ప్రశంసిస్తూ గురువారం విలియమూన్ స్కూల్ యజమాన్యం ఆయనను ఘనంగా సన్మానించింది.

తమ పాఠశాల పేరును చౌరస్తాకు పెట్టేలా కృషి చేసినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలను కౌన్సిల్ వేదికగా ముందుకు తీసుకెళ్లడం ఆదర్శనీయమని స్థానికులు ఈర్షాద్ కృషిని కొనియాడారు.

అనంతరం కౌన్సిలర్ ఈర్షాద్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయడమే తన లక్ష్యమని తెలిపారు. వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో యజమాన్య కమిటి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


