పోట్లీ మహారాజ్ దేవస్థానం చైర్మన్‌గా.. సుదర్శన్‌గౌడ్..?
– తాండూరు ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్
– త్వరలోనే అధికారిక ప్రకటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పోట్లీ మహారాజ్ దేవస్థానం చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు గోరేపల్లి సుదర్శన్‌గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం.

ఈ విషయమై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోట్లీ మహరాజ్ దేవాలయ చైర్మన్ విషయంపై పార్టీ పెద్దలతో పాటు ప్రభాకర్‌గౌడ్ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలిసింది.

దేవస్థానం చైర్మన్ పదవికి సుదర్శన్‌గౌడ్ పేరును ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. చర్చల అనంతరం ఆయన సానుకూలంగా స్పందించడంతో సుదర్శన్ గౌడ్ ఎన్నిక దాదాపు ఖరారు అయినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు.

దీంతో త్వరలోనే దేవస్థానం చైర్మన్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దేవాలయ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో చైర్మన్ పదవిపై సుదర్శన్ గౌడ్ ఆశలు సజీవంగా మారాయి.


