గణేశ్‌ లడ్డూ సొంతం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గణేశ్‌ లడ్డూ సొంతం..!
– రూ.1.70 లక్షలకు దక్కించుకున్న సిరిగిరిపేట్‌ బ్రదర్స్‌
– పసారి వార్డులో ఉత్సాహంగా లడ్డూ వేలం
తాండూరు, దర్శిని ప్రతినిధి:
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలోని పసారి వార్డులో గణేశ్‌ లడ్డూ వేలం ఘనంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో ఉత్సాహంగా సాగిన వేలంలో లడ్డూకు భారీ ధర పలికింది.

పసారి వార్డుకు చెందిన సిరిగిరిపేట్‌ బ్రదర్స్‌, సిరిగిరిపేట్‌ కుటుంబ సభ్యులు రూ.1,70,000కు గణేశ్‌ లడ్డూను కైవసం చేసుకున్నారు.

వేలంలో పోటీపడి లడ్డూను సొంతం చేసుకోవడంతో సిరిగిరిపేట్‌ కుటుంబ సభ్యులను నిర్వాహకులు అభినందించారు. వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడం శుభప్రదమని, గణనాథుడి ఆశీస్సులతో కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని భక్తుల విశ్వాసం.

దీంతో లడ్డూ వేలానికి భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. రూ.1.70 లక్షల ధర పలకడంతో పసారి వార్డులో లడ్డూ వేలం ప్రత్యేకంగా నిలిచింది.

వినాయక నిమజ్జనం ప్రశాంతం..!