గుప్త నిధుల కోసం వేట..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

గుప్త నిధుల కోసం వేట..!
– పాడుబడిన ఇంట్లో ఆగంతుల తవ్వకాలు
– ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
– బషీరాబాద్ మండల కేంద్రంలో ఘటన
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : గుప్త నిధుల కోసం గుర్తుతెలియని ఆగంతులు వేట మొదలెట్టారు. ఓ పాడుబడిన ఇంట్లో తవ్వకాలకు పాల్పడ్డారు. ఈసంఘటన ఆదివారం బషీరాబాద్ మండల కేంద్రంలో వెలుగులోకి రాగా స్థానికంగా కలకలం రేపింది.
kvcs
స్థానికులు, పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఓ కాలనీలో పాడుబడిన ఇళ్లు ఉంది. ఆదివారం ఉదయం ఆ ఇంట్లో నుంచి తవ్వకాలు చేస్తున్న శబ్దాలు వచ్చాయి. అనుమానం కలిగిన స్థానిక కాలనీ ప్రజలు బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పాడుబడిన ఇంట్లో ఆ వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు ప్రచారం జరిగింది. ఇందుకు సాక్షంగా ఇంట్లో పూజలు చేసిన ఆగరబత్తిలు, తవ్వకాలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ సంఘటన మండల కేంద్రంలో కలకలం రేపింది. మరోవైపు పోలీసులు ప్రశాంత్, మహేష్‌, పట్లోళ్ల శ్రీనివసా్, మొయిజ్, శివల అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మరోకరి ఆచూకీ తెలియాల్సి ఉందని, సమగ్ర విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

అన్నింట్లో ఐక్యతను చాటుదాం..!