వైద్య విద్యార్థినికి బీఎస్ఆర్ చేయూత..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

వైద్య విద్యార్థినికి బీఎస్ఆర్ చేయూత..!
– మహేశ్వరికి ఆర్థిక సాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పెద్దేముల్‌ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన సి. చెన్నప్ప కుమార్తె మహేశ్వరి ఎంబీబీఎస్‌ సీటు సాధించడంపై ఆర్బీఓఎల్ సీఈఓ, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (BSR) అభినందనలు తెలిపారు.

జయశంకర్‌ భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు సాధించిన మహేశ్వరిని సోమవారం ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి చదివి వైద్య విద్యలో ప్రవేశం పొందడం అభినందనీయమన్నారు.

లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్‌లో మంచి వైద్యురాలిగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. వైద్య విద్యకు సంబంధించిన ఖర్చుల కోసం మహేశ్వరికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు.

చదువుకు సంబంధించి భవిష్యత్‌లో ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని, సాధ్యమైనంత సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. మహేశ్వరి మెడికల్‌ సీటు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

బీసీ శ్మశాన వాటికకు మహర్దశ..!