మళ్లీ రెచ్చిపోయిన దొంగలు..!
– తాళం వేసిన ఇంట్లో చోరీ
– 2తులాల బంగారం, 70వేలు మాయం
యాలాల, దర్శిని ప్రతినిధి : తాండూరులో మళ్లీ దొంగలు రెచ్చిపోయారు. ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్న కోడంగల్ రోడ్డు మార్గంలో మరోసారి చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.

కొడంగల్ రోడ్డు మార్గంలోని ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. తాళం వేసిన ఆ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న సుమారు 3 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.70 వేల నగదును అపహరించినట్లు సమాచారం.

దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

మరోవైపు తాండూరు పట్టణ శివారులో వరుసగా చోరీలు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కాలనీల్లో గట్టి బందోబస్తు నిర్వహించి చోరీలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


