గుండెను కాపాడుకుందాం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

గుండెను కాపాడుకుందాం..!
– అందరూ అవగాహన పెంచుకోవాలి
– ఐఎంఏ తాండూరు అధ్యక్షుడు డా. జయప్రసాద్
– తాండూరులో ఉత్సాహంగా హార్ట్ హెల్త్ అవేర్‌నెస్ వాక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తాండూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హార్ట్ హెల్త్ అవేర్‌నెస్ వాక్ నిర్వహించారు.

శివాజీ చౌక్ నుంచి తాండూరు పోలీస్‌స్టేషన్ వరకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ప్రజలు వాక్‌లో పాల్గొని గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం పాల్గొన్న వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఐఎంఏ తాండూరు అధ్యక్షుడు డా. జయప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుత జీవనశైలి కారణంగా గుండె సంబంధిత సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నిత్యం శారీరక వ్యాయామం, నడక, సమతుల ఆహారం, ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని తెలిపారు.

“ఆరోగ్యకరమైన గుండెతోనే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యం. గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి” అని డా. జయప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు, సభ్యులు, ప్రముఖ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

పట్లోళ్ల నర్సింలు ఇంటికి బీఎస్‌ఆర్‌