పట్లోళ్ల నర్సింలు ఇంటికి బీఎస్ఆర్
– మనుమడును ఆశీర్వదించిన శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు ఇంటికి ఆర్డీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు.

ఇటీవల మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల మనుమడు (కూతురు సంధ్యా, అశోక్ రెడ్డిల కుమారుడు) ఆథర్వ స్కంధా రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

ఈ వేడకకు హాజరు కాలేకపోయినందుకు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సోమవారం సాయంత్రం సాయిపూర్లోని పట్లోళ్ల నర్సింలు నివాసానికి వెళ్లారు. పట్లోళ్ల నర్సింలు, రత్నామల మనుమడు ఆధర్వ స్కంధారెడ్డికి ఆశీస్సులు అందించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి తేనీటీ వింధును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పట్లోళ్ల నర్సింలు కుమారుడు డా. పట్లోళ్ల రేవంత్ కుమార్, కుటుంబ సభ్యులు ఉన్నారు.


