బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చేయూత
– తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
– లబ్ధిదారునికి ఎల్ఓసీ అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాత తాండూరుకు చెందిన మహమ్మద్ నిజాం పటేల్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.60 వేల ఆర్థిక సహాయం అందింది. శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి మంజూరైన చెక్కును నిజాం పటేల్‌కు అందజేశారు.

పాత తాండూరులోని నిజాం షాహిద్ దర్గా ప్రాంతానికి చెందిన మహమ్మద్ నిజాం పటేల్ ద్విచక్ర వాహనం నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం నగరంలోని ఏబీఎస్ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు 82 కుట్లు వేసి చికిత్స అందించారు.

ప్రస్తుతం కోలుకున్న ఆయనకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థిక సహాయం అందేలా మహేందర్‌రెడ్డి సిఫార్సు చేశారు. ఈ మేరకు రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు కావడంతో చెక్కును బాధితుడికి అందజేశారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్యం, ప్రమాదాల సమయంలో సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం అండగా నిలుస్తుందని మహేందర్‌రెడ్డి తెలిపారు. మంజూరైన మొత్తాన్ని వైద్య అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎజాజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.


