ఇన్‌ఫ్లూఎంజా టీకా ఒక్కటి చాలు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఇన్‌ఫ్లూఎంజా టీకా ఒక్కటి చాలు
– సీజనల్‌ వ్యాధుల నుంచి సంపూర్ణ రక్షణ
– యశోధ ఆసుపత్రి వైద్యులు డా. వై. సాయిరెడ్డి
– తాండూరులో టీకా వినియోగంపై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీజనల్‌గా వచ్చే ఇన్‌ఫ్లూఎంజా (ఫ్లూ) వంటి శ్వాసకోశ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యశోద ఆసుపత్రి వైద్యులు డా. వై. సాయిరెడ్డి సూచించారు.

ఇన్‌ఫ్లూఎంజా టీకా వల్ల ఫ్లూ బారినపడే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు, వ్యాధి వచ్చినా తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. తాండూరులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డా. సాయిరెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల సమయంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదన్నారు.

ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఫ్లూ సంబంధిత సమస్యల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇన్‌ఫ్లూఎంజా టీకా శరీరంలో వ్యాధిని ఎదుర్కొనే రోగనిరోధక స్పందనను కలిగిస్తుందని, టీకా తీసుకున్న తర్వాత రక్షణ అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు వివరించారు. వయస్సు, ఆరోగ్య పరిస్థితులను బట్టి తగిన టీకాను వైద్యుల సలహాతో తీసుకోవాలని సూచించారు.
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా ధూమపానం చేసేవారు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి ఇన్‌ఫ్లూఎంజా మరియు నిమోకోకల్ వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచించారు.

ప్రతి సంవత్సరం సీజనల్‌ ఇన్‌ఫ్లూఎంజా టీకా తీసుకోవడం వల్ల ఫ్లూ కారణంగా వచ్చే అనారోగ్యం, ఆసుపత్రి చేరే పరిస్థితులు వంటి తీవ్ర పరిణామాల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనం ఉంటుందని, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వైద్యుల సలహా తీసుకోవడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రతినిధులు సుదర్శన్‌రెడ్డి, హరితేజ పాల్గొన్నారు.

ప్రసవం అనంతరం తల్లీ.. శిశువు మృతి..!