తాండూరులో మరో రోడ్డు ప్రమాదం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో మరో రోడ్డు ప్రమాదం
– చౌరస్తాలో బైకును ఢీకొట్టిన లారీ
– ఒకరి పరిస్థితి విషమం, మరొకరికి గాయాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో గత రెండు రోజులుగా రోడ్డు ప్రమాదాలు వాహనదారులను, ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా గురువారం తాండూరు పట్టణంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని చౌరస్తాలో మలపు వద్ద లారీ బైకును ఢీకొట్టింది. ఇందులో ఒకరికి తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా మారింది. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు తాండూరు మండలం కరణ్‌ కోట్ గ్రామానికి చెందిన బోయిని నాగేష్‌(38) యాలాల మండలంలోని రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం బస్టాండ్‌ వైపు నుంచి చించొల్లి రోడ్డు మార్గంలో తన బైకుపై కాంట్రాక్టు ఉద్యోగి అయిన కూర్మారావు అనే వ్యక్తితో కలిసి వస్తున్నారు. పట్టణంలోని చౌరస్తా వద్దకు రాగానే హైదరాబాద్ రోడ్డు వైపు నుంచి వస్తున్న ఓ లారీ మలుపు వద్ద నాగేష్ వెళుతున్న బైకును ఢీ కొట్టింది.

ఈక్రమంలో నాగేష్‌ లారీ కింద పడిపోయాడు. కూర్మారావు మరో ప్రదేశ్వంలో పడిపోయాడు. లారీ కింద పడిన నాగేష్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కూర్మారావుకు కాలుకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగేష్‌ నడుము భాగంలో తీవ్ర రక్తగాయాలు కాగ పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ రిఫర్ చేసినట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!