భళా.. బచ్ పన్ సేవా..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

భళా.. బచ్ పన్ సేవా..!
– చారిటబుల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
– అభినందించిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి 
– స్వచ్ఛందంగా దానం చేసిన దాతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోకుండా ఉండాలన్న మానవతా సంకల్పాన్ని బచ్ పన్ చారిటబుల్‌ ట్రస్ట్‌ చాటింది.

ఆదివారం ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జేబీ హాస్పిటల్‌ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 30 యూనిట్ల రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేసి రక్తదాతలు సేవా స్ఫూర్తిని చాటారు. సెయింట్‌ మార్క్స్‌ హైస్కూల్‌ తాండూరు 1998–99 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్య సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకులు తదితరులు శిబిరానికి తరలివచ్చి రక్తదానం చేశారు.

‘మన రక్తం.. మరొకరి ప్రాణం’ అనే స్ఫూర్తితో పలువురు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజ బాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలను అభినందించారు. ఆమె మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంతో పాటు సమాజం పట్ల మన బాధ్యతను చాటినట్లవుతుందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.

డా. కళ్యాణ్‌ మోహన్‌రావు మాట్లాడుతూ అత్యవసర సమయంలో రక్తం కోసం ఎదురుచూస్తున్న వారికి రక్తదాతలు అందించే సహాయం ఎంతో విలువైనదన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ వీలైనప్పుడు రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. పీసీసీ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌ మాట్లాడుతూ రక్తదానం మానవత్వానికి ప్రతీక అన్నారు. మనం ఇచ్చే రక్తం మరో కుటుంబంలో వెలుగును నింపగలదని, అందుకే రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్‌ వ్యవస్థాపకులు ఎం. మోహన్ కృష్ణ గౌడ్, అధ్యక్షుడు ఎం.ఏ. మతీన్‌ మాట్లాడుతూ మన రక్తం మరొకరి ప్రాణానికి ఆధారం కావడం కంటే గొప్ప సేవ మరొకటి లేదు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు.
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్‌ బాల్‌రెడ్డి, తాండూరు కాంగ్రెస్‌ అధ్యక్షుడు బతుల నాగు, మాజీ అధ్యక్షుడు హబీబ్‌ లాల, ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు జి. రంజిత్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గాయత్రి, జనరల్ సెక్రటరీ బి. రవికుమార్, జాయింట్ సెక్రటరీ విజయానంద్, ట్రెజరర్ తయాబ్ ఎర్షాద్, అడ్వైజరీ కమిటి సభ్యులు కిషన్ గోపాల్‌రాథి, బి. అరుణ్ కుమార్, నాయకులు, రక్తదాతలు పాల్గొన్నారు.

కోట్ పల్లి మార్కెట్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి