-మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఆ రోడ్డుకు మరమ్మత్తులు వెంటనే మరమ్మత్తులు చేయిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం శివాజీ చౌక్ ప్రాంత ప్రజల ఫిర్యాదు మేరకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఆ ప్రాంతానికి వెళ్లారు.

అక్కడ పాడైన రోడ్డును పరిశీలించారు. దాదాపు 100 మీటర్ల రోడ్డు పాడై పోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు చైర్ పర్సన్‌తో అన్నారు. ఇందుకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ స్పందిస్తూ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేయించే విధంగా చూస్తామని పేర్కొన్నారు. రోడ్డు మరమ్మత్తులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

