శ్రీవారి భక్తులకు శుభవార్త..!

తాండూరు రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

శ్రీవారి భక్తులకు శుభవార్త..!
– తాండూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైళ్లు
– ఈ నెల 15, 16 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు**
– దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ఈ రైళ్లు తాండూరు మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 15వ తేదీన తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు బయలుదేరనుంది. రైలు నంబర్ 07421 సాయంత్రం 4.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07422 ఈ నెల 16న సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు తిరుపతి చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైళ్లు తాండూరు, వికారాబాద్‌తో పాటు పలు ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి.

హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కర్ణాటకలోని సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, ఆంధ్రప్రదేశ్‌లోని పలు స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో తిరుపతి, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వారికి, ముఖ్యంగా తాండూరు ప్రాంత ప్రయాణికులకు అదనపు రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ఇక పింఛను ఆగదు..!