కాంగ్రెస్‌లో ‘వార్‌’గ విభేదాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌లో ‘వార్‌‘గ విభేదాలు..!
– చైర్‌పర్సన్‌కు సొంత పార్టీ కౌన్సిలర్ల షాక్‌
– ఫోటో లేకుండా ఫెక్సీ ఏర్పాటుతో వివాదం
– ఎమ్మెల్యే పర్యటనలో అంతర్గత పోరు బహిర్గతం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు వర్గ విబేధాలు.. సొంత పార్టీల నేతల మద్య వార్‌ను తలిపిస్తున్నాయి.

నిన్న బషీరాబాద్‌ మండలంలో సర్పంచ్‌ ఫోటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ విబేధాలు తాండూరు పట్టణానానికి పాకాయి. తాజాగా బుధవారం తాండూరులో జరిగిన ఎమ్మెల్యే పర్యటనలో చైర్ పర్సన్‌ ఫోటో లేకుండా సొంత పార్టీ కౌన్సిలర్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

గత కొన్ని రోజులుగా మున్సిపల్ చైర్ పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు అనే విధంగా విబేధాలు ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడుగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశానికి ఆ ఇద్దరు కౌన్సిలర్లు డుమ్మా కొట్టడం ప్రచారానికి బలం చేకూర్చింది. ఈ విషయమై ఎమ్మెల్యే వద్ద పంచాయతీ జరిగినా కూడా వివాదం సమిసిపోనట్లుగా కనిపిస్తోంది. బుధవారం తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఎమ్మెల్యే పర్యటనకు ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ సొంత పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు చైర్ పర్సన్‌ ఫోటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం విబేధాలు మరింత ముదిరినట్లు బహిర్గతం చేశాయి. అయితే ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో పార్టీ నేతలు ఓ కౌన్సిలర్‌తో వాగ్వివాదానికి దిగారు. దీనికి సదరు కౌన్సిలర్ ధీటుగా ఎదుర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పైగా చైర్ పర్సన్ తమ వార్డులో పర్యటించిన సమయంలో మా ఫోటోలు ఎందుకు పెట్టలేదని నిలదీసినట్లు తెలిసింది. మరోవైపు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు చైర్ పర్సన్‌కు మద్దతుగా నిలుస్తూ.. కౌన్సిలర్లు చేసిన పనిని వ్యతిరేకించారు. ఏదేమైనా తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సొంత కౌన్సిలర్లు చైర్ పర్సన్‌కు ఎదురు తిరగడంపై తీవ్ర రాజకీయ చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ ముందస్తు అరెస్టు..!