జనగణనకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్..!
– జనవరి 25 నుంచి లెక్కల వేట
– ఇంటింటికీ బృందాలు.. విధానాలు ఖరారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన చేపట్టనుండగా.. మార్చి 1 నుంచి 5 వరకు రివిజినల్ రౌండ్ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

జనగణన ప్రక్రియలో ప్రజలు నేరుగా భాగస్వాములు అయ్యేందుకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. జనవరి 10 నుంచి 24 వరకు యాప్, వెబ్‌సైట్ ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టారు.

ఇప్పటికే మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల గణన పూర్తయింది. రెండో విడతలో జనాభా లెక్కల సేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. సన్నాహక సమావేశాలతో పాటు సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిర్ణీత గడువులో జనగణన ప్రక్రియను పూర్తి చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.


