నేడే మహారుద్రాభిషేకం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నేడే మహారుద్రాభిషేకం..!
– తాండూరు గోశాల ముస్తాబు
– శంకర్‌ యాదవ్‌–చంద్రకళ దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు
– భక్తులందరికీ ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి:కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తాండూరు గోశాలలో నేడు మహారుద్రాభిషేకం నిర్వహించనున్నారు. గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సాయిపుత్ర హోమ్స్‌ అధినేత శంకర్‌ యాదవ్‌, చంద్రకళ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబాత్రయ క్షేత్రం, నారాయణపేటకు చెందిన శ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ హాజరుకానున్నారు. విశిష్ట అతిథిగాచిలుకూరు బాలాజీ శివాలయం ప్రధాన అర్చకుల శ్రీ రామదాసి సురేష్‌ ఆత్మారాం మహారాజ్‌ పాల్గొననున్నారు.

మహారుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు రుద్రాక్షలు అందజేయనున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.

ఇస్కాఫ్‌ జిల్లా, తాండూరు డివిజన్‌ కమిటీలు ఎన్నిక