తెలంగాణలో రేపు ప్రభుత్వ సెలవు..!
– కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతితో నిర్ణయం
– అధికారిక సెలవుల జాబితాలో ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో రేపు (నవంబర్ 24, మంగళవారం) సాధారణ సెలవు ప్రకటించారు.

కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి పర్వదినాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం 2026 అధికారిక సెలవుల జాబితాలో ఈ రోజును సాధారణ సెలవుగా చేర్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వర్తించనుంది.

కార్తీక పౌర్ణమి హిందువులకు పవిత్రమైన పర్వదినం కాగా, సిక్కుల తొలి గురువు గురునానక్ దేవ్ జయంతిని కూడా ఇదే రోజున జరుపుకుంటారు.

ఈ రెండు పర్వదినాలు ఒకే రోజు రావడంతో ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించింది. ప్రభుత్వ సెలవు జాబితా ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి.


