చెస్‌ పోటీల్లో నేతాజీ విద్యార్థుల డబుల్‌ ధమాకా..!

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

చెస్‌ పోటీల్లో నేతాజీ విద్యార్థుల డబుల్‌ ధమాకా..!
– జిల్లా స్థాయి ఛాంపియన్‌షిప్‌లో రెండు విభాగాల్లోనూ ఫస్ట్ ప్రైజ్‌
– సీనియర్‌లో భవాని శంకర్‌.. జూనియర్‌లో అనురాగ్‌ శర్మ విజయం
తాండూరు, దర్శిని ప్రతినిధి: జిల్లా స్థాయి చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీ నేతాజీ గురుదేవ్‌ గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.

టీఆర్‌ఎస్‌ఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో ప్రథమ స్థానాలను కైవసం చేసుకుని పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. సోమవారం తాండూరు పట్టణంలోని విశ్వవేధ పాఠశాలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సీనియర్‌ విభాగంలో భవాని శంకర్‌ మొదటి స్థానం సాధించగా, జూనియర్‌ విభాగంలో అనురాగ్‌ శర్మ విజేతగా నిలిచాడు.

ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు విభాగాల్లోనూ ప్రథమ బహుమతులు సాధించడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవేద పాఠశాల అధ్యక్షుడు డాక్టర్‌ సంపత్‌, టీఆర్‌ఎస్‌ఎంఏ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు నాగయ్య, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, తాండూరు అధ్యక్షుడు మోహన్‌ కృష్ణ గౌడ్‌ హాజరై విజేతలను అభినందించారు.

పాఠశాల యాజమాన్యం, డైరెక్టర్‌, ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను ప్రత్యేకంగా ప్రశంసించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచడం పట్ల నేతాజీ గురుదేవ్ స్కూల్ యజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎస్‌సీఆర్‌ఎంయూ కృషి