అబ్దుల్ రవూఫ్‌ను పరామర్శించిన బీజేపీ నేతలు
– ఆరోగ్యంపై జిల్లా అధ్యక్షులు యు.రమేష్ కుమార్ ఆరా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన సీనీయర్ నాయకులు, మైనార్టీ నేత అబ్దుల్ రవూఫ్‌ను బీజేపీ నేతలు పరామర్శించారు.

ఇటీవల అనారోగ్యానికి గురైన అబ్దుల్ రవూఫ్ హైదరాబాద్‌లో చికిత్స పొంది.. నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న అబ్దుల్ రవూఫ్‌ను సోమవారం బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు యు.రమేష్ కుమార్, నేతలు కలిశారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మనోధైర్యంతో ఉండాలని, త్వరంగా క్షేమంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తనను పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలకు అబ్దుల్ రవూఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తాండూరు ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, నాయకులు దోమ కృష్ణ తదితరులు ఉన్నారు.


