కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని కాపాడండి
– తాండూరు ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ రాము
తాండూరు, దర్శిని ప్రతినిధి : కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని కాపాడాలని మున్సిపల్ కౌన్సిలర్ రాము కోరారు. గురువారం ఆయన వాల్మీకి సంఘం సభ్యులతో కలిసి తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్కు ఓ ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి సమీపంలో ఉన్న సర్వెనెంబర్ 111లోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు రాజకీయ నాయకుల అండదండలతో కబ్జా చేశారని ఆరోపించారు.

సర్వేనెంబర్ 111లోని భూమిని సర్వేనెంబర్ 112లోకి వస్తుందని తప్పుడు పత్రాలను సృష్టించారని అన్నారు. నిజానికి 112 సర్వేనెంబర్ మున్సిపల్ పరిధిలోకి రాదని, దీనిని ఆసరా చేసుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని వివరించారు. కావున కబ్జాకు గురైన భూమిని కాపాడాలని ఆర్డీఓ అశోక్ కుమార్ను కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకీ సంఘం నాయకులు లక్ష్మణ్, నర్సింలు, భీమప్ప, కురుమయ్య, చింతలయ్య, బాలు, కొత్తపల్లి నర్సింహులు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

