సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం
– ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ డిస్ట్రిక్ట్ అధ్యక్షులుగా రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్నేషన్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఫెడరేషన్ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ అధ్యక్షులుగా రొంపల్లి సంతోష్ కుమార్ నియామకమయ్యారు. అదేవిధంగా కార్యదర్శిగా దోమ శ్రీకాంత్ , ఖోశాధికారిగా అగీరు మహేష్ కుమార్ ని , రాష్ట్ర ఉపాదక్షులుగా కొక్కల సంతోష్ కుమార్‌లు నూతనంగా నియమితులయ్యారు. వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ అధ్యక్షులు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మిదుగా నియమిత పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, నూతన సభ్యులు ఉప్పల రాజేష్ గుప్తకు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైశ్య ఫెడరేషన్ ని డిస్ట్రిక్ట్ లో అన్ని సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ వైశ్య ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ పబ్బా చంద్రశేఖర్, సభ్యులు పాల్గొన్నారు.

