శ్రీ‌వారి ద‌ర్శ‌నంలో ప్ర‌ముఖులు

తాండూరు వికారాబాద్

శ్రీ‌వారి ద‌ర్శ‌నంలో ప్ర‌ముఖులు
– ద‌ర్శించుకున్న వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు
– పూజ‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్ సంప‌త్, సునితా సంప‌త్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఉత్త‌ర ద్వారా ద‌ర్శ‌నంలో భాగంగా తాండూరు ప్ర‌ముఖులు సంద‌డి చేశారు. ముక్కోటి ఏకాద‌శి సంద‌ర్భంగా శ్రీ‌వారిని స‌తీస‌మేతంగా ద‌ర్శించుకున్నారు. తాండూరు మండ‌లం అంతారం అనుబంధ గ్రామం ద‌స్త‌గిరి పేట్‌లో వెల‌సిన శ్రీ శ్రీ‌దేవి, శ్రీ భూదేవి, శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వార్ల‌ను మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయకులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, మాజీ కౌన్సిల‌ర్ ప‌ట్లోళ్ల సావిత్ర‌మ్మ‌లు కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. అదేవిధంగా మున్సిప‌ల్ మాజీ చైర్ ప‌ర్స‌న్ సునితాసంప‌త్, టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు డాక్ట‌ర్ సంప‌త్ కుమార్‌లు కూడ శ్రీవారిని ద‌ర్శించుకుని పూజ‌లు నిర్వ‌హించారు.