తల్లికి నివాళులు అర్పించిన మంత్రి సబితారెడ్డి
– కోటబాస్పల్లిలో వెంకటమ్మ 5వ వర్దంతి
– నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన తల్లి స్వర్గీయ గొట్టుగ వెంకటమ్మ, తండ్రి స్వర్గీయ మాజీ ఎంపీపీ గొట్టుగ మహిపాల్ రెడ్డిలకు నివాళులు అర్పించారు. శుక్రవారం తాండూరు మండలంలోని కోటబాస్పల్లిలో స్వర్గీయ గొట్టుగ వెంకటమ్మ 5వ వర్దంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి సోదరుడు నరసింహ్మ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని సృతివనంలో ఉన్న తల్లిదండ్రులు స్వర్గీయ వెంకటమ్మ మహిపాల్ రెడ్డి గార్ల సమాదుల వద్ద మంత్రి సబితారెడ్డి పూలు చల్లి నివాళులు అర్పించారు.
అనంతరం తల్లి వర్థంతి సందర్భంగా పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాందాస్, నాయకులు శేఖర్, మహిళ నాయకురాలు శకుంతల, సర్పంచులు రాములు, నరేందర్ రెడ్డి, పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు మొగులప్ప, శేఖర్, ఉపాధ్యాయ నేతలు నర్సిరెడ్డి, నాగప్ప, కిష్టప్ప, శశిధర్, నేతలు కోట్రిక కిరణ్ కుమార్, శేఖర్ గౌడ్, సీటీకేబుల్ మేనేజర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

