బాలికల సంరక్షణ అందరి బాధ్యత
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– బాలికలతో కేక్ కట్ చేసిన చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త పేర్కొన్నారు. సోమవారం నాబార్ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ బాలికలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ నేటికి బాల్య వివాహాలు, అక్రమ రవాణా, అఘాయిత్యాలతో బాలికలు వివక్షకు గురికావడం బాధాకరమన్నారు. బాలికల సంరక్షణకు అందరు కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు కూడ బాల్యం నుంచి బాలికలను ప్రోత్సహించాలని అన్నారు. బాలికలు అన్ని రంగాల్లో బాలికలు ఎదిగినప్పుడే సమాజంలో మార్పు సాధ్యపడుతుందని అన్నారు. బాలికలు కూడ మహనీయుల స్పూర్తితో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు ప్రతినిధులు, బాలికలు పాల్గొన్నారు.

