దైవభక్తి.. దేశభక్తి..!

తాండూరు వికారాబాద్

దైవభక్తి.. దేశభక్తి..!
– మువ్వెన్నెల వస్త్రాలంకరణలో శివుడు
– దర్శించుకున్న భక్తులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో దైవభక్తితో పాటు దేశభక్తి శోభ సంతరించుకుంది. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆలయంలో వెలసిన శివుడు త్రివర్ణ శోభితుడుగా దర్శనమిచ్చారు. ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శివునికి మువ్వెన్నెల వస్త్రాలంకరణ చేశారు. జాతీయ జెండా రంగులతో కూడిన పువ్వులను ఆలంకరించి పూజలు చేశారు. దీంతో త్రివర్ణ అలంకరణలో శివుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు త్రివ‌ర్ణ అలంక‌ర‌ణ‌లో దర్శన‌మిచ్చిన శివుడు విశేషంగా ఆక‌ట్టుకున్నారు. దైవభక్తితో పాటు భక్తులకు దేశభక్తి చాటుకున్న ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామిని పలువురు అభినందించారు. ఆలయ పూజారి తన నైపుణ్యంతో ప్రతి యేడాది గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవాల్లో శివున్ని జాతీయ జెండా అలంకరించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.