ఆసుప‌త్రిలో అన్న‌దానం, పండ్ల పంపిణీ

తాండూరు వికారాబాద్

ఆసుప‌త్రిలో అన్న‌దానం, పండ్ల పంపిణీ
– వైశ్య ఫెడ‌రేష‌ణ్, వాస‌విక్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో విత‌ర‌ణ‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఇంట‌ర్నేష‌న‌ల్ వైశ్య ఫెడ‌రేష‌న్, వాస‌విక్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. 73వ గ‌ణంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం తాండూరులోని ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రితో పాటు హైద‌రాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుప‌త్రిలో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.
వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వ‌ర్యంలో ఆసుప‌త్రిలో రోగుల‌కు పండ్లు, బ్రెడ్‌ల‌ను పంపిణీ చేశారు. అదేవిధంగా రోగులతో పాటు వెంట వ‌చ్చిన బంధువుల‌కు అన్న‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ గ‌ణతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రోగుల‌కు, ప్ర‌జ‌ల‌కు అన్న‌దానం, పండ్లు పంపిణీ చేయ‌డం సంతోషం వ్య‌క్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ ట్రెజ‌ర‌ర్ అగీరు మహేష్, తాండూరు అధ్యక్షులు గౌరీశంకర్, వాసవి క్లబ్ అధ్యక్షులు వంశీ, కోశాధికారి శ్రీకాంత్ సభ్యులు ప్రమోద్, వీరేశం, ప్రవీణ్, జగన్, హరీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.