మహేందరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీటీసీ గౌడి మంజుల‌

తాండూరు రాజకీయం వికారాబాద్

మహేందరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీటీసీ గౌడి మంజుల‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి తాండూరు జెడ్పీటీసీ గౌడీ మంజుల శుభాకాంక్ష‌లు తెలిపారు. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా మ‌హేంద‌ర్ రెడ్డి అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, టీఆర్ఎస్ నాయ‌కులు గౌడీ వెంక‌టేశంలు హైద‌రాబాద్‌లో మ‌హేంద‌ర్ రెడ్డిని క‌లిసి పుష్ప‌గుచ్చం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డితోనే తాండూరు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా మ‌హేంద‌ర్ రెడ్డి మ‌రింత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తార‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.