హ‌రిత హారంకు మొక్క‌ల‌ను సిద్దం చేయండి

తాండూరు వికారాబాద్

హ‌రిత హారంకు మొక్క‌ల‌ను సిద్దం చేయండి
– కొత్త న‌ర్స‌రీల ఏర్పాటుకు శ్ర‌ద్ద చూపాలి
– ట్రీ పార్కుల‌ను అహ్లాదంగా మార్చాలి
– సీడీఎంఏ జాయింట్ డైరెక్ట‌ర్ గీతా రాధిక
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టే హ‌రిత‌హారంకు మొక్క‌ల‌ను సిద్దం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీడీఎంఏ జాయింట్ డైరెక్ట‌ర్, స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్, హ‌రిత‌హారం స్పెష‌ల్ ఆఫీస‌ర్ గీతా రాధిక తాండూరు మున్సిప‌ల్ అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం తాండూరు మున్సిప‌ల్‌ను ఆమె సంద‌ర్శించారు. అనంత‌రం ప‌ట్ట‌ణంలోని బృందావ‌న కాల‌నీలోని న‌ర్స‌రీని, ఇందిరాన‌గ‌ర్ 6వ వార్డులోని ప‌ట్ట‌ణ ప్ర‌కృతి వ‌నం(ట్రీపార్కు), రాజీవ్ కాల‌నీలోని కొత్త పార్కుల‌తో పాటు అవెన్యూ ప్లానిటేష‌న్‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప‌ట్ట‌ణంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన న‌ర్స‌రీల‌ను త్వ‌రంగా ఏర్పాటు చేయాల‌న్నారు. ట్రీపార్కుల‌లో ఆహ్లాదాన్ని పంచేలా మొక్క‌ల పెంప‌కం చేప‌ట్టాల‌ని అన్నారు. అవెన్యూ ప్లానిటేష‌న్ స‌క్ర‌మంగా చేప‌ట్టాల‌ని సూచించారు. ముఖ్యంగా హ‌రిత‌హారంలో ప్ర‌భుత్వం నిర్దేశించిన 73వేల 500ల మొక్క‌ల ల‌క్ష్యానికి అనుగుణంగా మొక్క‌ల‌ను సిద్దం చేయాల‌ని ఆదేశించారు. మ‌రోవైపు మున్సిప‌ల్‌లో ప‌న్నుల వ‌సూళ్ల‌పై ఆరా తీశారు. ఆర్థిక సంవ‌త్స‌రం ల‌క్ష్యానికి అనుగుణంగా వసూళ్ల‌ను వేగ‌వంతం చేయాలని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ మేనేజ‌ర్ న‌రేంద‌ర్ రెడ్డి, డీఈ రంగ‌నాథం, శానిట‌రీ ఇనుస్పెక్ట‌ర్ శ్యాంసుంద‌ర్, ఎన్విరాల్‌మెంట్ ఇంజ‌నీర్ ప్ర‌వీణ్, సిబ్బంది ఉన్నారు.