జోష్‌ఫుల్‌గా శివాజీ జ‌యంతి

తాండూరు వికారాబాద్

జోష్‌ఫుల్‌గా శివాజీ జ‌యంతి
– తాండూరులో అంబరాన్నంటిన వేడుకలు
– పురవీదుల్లో శోభాయమానంగా శోభాయాత్ర
– ర్యాలీలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : మరాఠా యోధుడు చ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జయంతి వేడుక‌లు తాండూరులో జోష్‌పుల్‌గా జ‌రిగాయి.శ‌నివారం తాండూరులో శివాజీ మ‌హారాజ్ 392 వ జయంతి అంబరాన్నంటే విధంగా జరుపుకున్నారు. శివాజీ జయంతి సందర్భంగా పట్టణంలోని కాళికాదేవి ఆలయం నుంచి భారీ శోభాయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.
అంతకుముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ర్యాలీలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు పబ్లిళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, రాజుగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి ప్రారంభమైన శోభాయాత్ర శాంత్మహాల్ చౌరస్తా, వినాయక్ చౌక్, ఇందిరాచౌక్, మల్లప్ప మడిగ మీదుగా శివాజీ చౌరస్తా వరకు కొనసాగింది. ర్యాలీలో యువకులు శివాజీ మ హారాజ్ జై.. జై శివాజీ.. జైజై శివాజీ అంటూ నినాదాలు చేశారు. పురవీధుల్లో శోభాయాత్ర శోభాయమానంగా కొనసాగింది. శివాజీ చౌరస్తాలో విగ్ర హానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

భారత సంస్కృతి రక్షకుడు చత్రపతి శివాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాండేందుకు చత్రపతి శివాజీ కృషి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమత సహనం, స్త్రీలు, తల్లిపై గౌరవంగా మెలగాలని జగతికి సందేశమిచ్చిన శివాజీ అందరికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. భారతదేశ సంస్కృతి రక్షకుడుగా అభివర్ణించారు. యువతన ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, నాయకులు నర్సిరెడ్డి, హిందూ ఉత్సవ సమితి, భజరంగ్ దళ్, విహెచ్పీ, యువజన సంఘాల ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.