శ్రీ‌రాములోరి క‌ళ్యాణానికి ఆన్‌లైన్ టిక్కెట్లు

తెలంగాణ హైదరాబాద్

శ్రీ‌రాములోరి క‌ళ్యాణానికి ఆన్‌లైన్ టిక్కెట్లు
– ప్ర‌త‌క్షంగా వీక్షించేందుకు స‌దుపాయం
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి క‌ళ్యాణోత్స‌వాన్ని ప్ర‌త‌క్షంగా వీక్షించేందుకు ఆల‌య క‌మిటి స‌భ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. వ‌చ్చేనెల ఏప్రిల్ 2 నుంచి 16 వరకు ఆల‌యంలో శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మో త్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ నెల 10న జరిగే కల్యాణాన్ని ప్రత్య క్షంగా వీక్షించేందుకు సెక్టార్లుగా విభజించారు. నిర్దేశించిన టికెట్లను గురువారం నుంచి ఆన్‌లైన్ ద్వాఆర‌ పొందవచ్చని ఈవో శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.7,500, రూ.2,500, రూ.2,000, రూ. 1,000, రూ.300, రూ.150 విలువైన టికెట్లను www.bhadrachalamonline.com అనే వెబ్ సైట్ నుంచి తీసుకోవచ్చని వివరించారు. రూ. 7,500 టికె మాత్రం కల్యాణ ఉభయ దాత‌లకు అనుమ‌తి ఉంటుంద‌న్నారు. దీనిని నేరుగా ఆలయ కార్యాలయంలో కూడా తీసుకోవ చ్చని వెల్లడించారు. ఏప్రిల్ 11న జరిగే పట్టాభి షేకం పర్వానికి సంబంధించి సెక్టార్ ప్రవేశానికి రూ.1,000 టికెట్‌ను ఆన్‌లైన్‌లో తీసుకోవాలని సూచించారు.