అసలైన మహిళ బంధువు సీఎం కేసీఆరే..!

తాండూరు వికారాబాద్

అసలైన మహిళ బంధువు సీఎం కేసీఆరే..!
– మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
– 21వ వార్డులో ఘ‌నంగా మ‌హిళ బంధు సంబ‌రాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : మ‌హిళ సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆరే మ‌హిళ‌ల పాలిట అసలైన బంధువుగా మారార‌ని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రెండో రోజు సోమవారం పట్టణంలోని 21వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ సల్మా పాతిమా జుబేర్ లాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంధు సంబరాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ ప‌ట్లోళ్ల రత్నమాల నర్సింలు, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు బిర్కడ్ ఉశ, మాజీ కౌన్సిలర్ జుబేర్‌లాల‌, కౌన్సిలర్లు వెంకన్నగౌడ్, రవి తదితరులతో కలిసి వార్డులోని అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, గాజులు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సంద‌ర్భంగా చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళల భ‌ద్ర‌త‌, సంక్షేమం, ఆరోగ్యం ల‌భిస్తున్నాయ‌న్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో సీఎం కేసీఆర్ అంద‌రికి ద‌గ్గ‌రి బంధువు అయ్యార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ నాయ‌కులు రాజేశేఖ‌ర్, అశోక్, దావుల‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.