తాండూరు స్టోన్ భవన్ అభివృద్ధికి సహాకారం
– నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్, స్టోన్ భవన్ అభివృద్ధికి సహాకారం అందిస్తానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. స్టోన్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన అప్పూ(నయూం) తన కార్యవర్గ సభ్యులతో కలిసి శనివారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అసోసియేషన్ నూతన అధ్యక్షులు అప్పూ, కార్యవర్గ సభ్యులను సన్మానించి అభినందించారు.
అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులోని స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్, స్టోన్ భవన్ అభివృద్ధికి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు అసోసియేషన్ అభివృద్ధితో పాటు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసోసియేషన్ మాజీ అధ్యక్షులు అల్బుక్షన్ ఘని, ఓం ప్రకాష్ సోమాని, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫైయాజ్ బైగ్, ఉపాధ్యక్షులు కుంచెం మురళీధర్, అబ్దుల్ సమద్, కోశాధికారి సంజీవావు, జైనోద్దీన్, హేమంత్ కుమార్ తదితరులు ఉన్నారు.

