కాస్ట్లీ ఆర్జీసీ..!
– ప్రయాణికులపై చార్జీల భారం
– జనరల్, ఎన్జీఓల బస్పాస్ ధరల పెంపు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తక్కువ ధరకే సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తామన్నా ఆర్టీసీ ప్రయాణికులకు చుక్కలు చూపించేందుకు సిద్దమయ్యింది. చార్జీలను పెంచి ప్రయానికులపై భారం మోపుతోంది. ఇప్పటికే ఆర్టీసీ పల్లె వెలుగు(palle velugu) బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పేరుతో ఛార్జీలను రౌండప్ చేశారు. దీనిపై ప్రజలకు ఇంకా అవగాహన రాలేదు. ఇక తాజాగా సెస్ పేరిట ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచేశారు. వీటి గురించి చాలామందికి తెలీనే తెలీదు. తాజాగా ప్రయాణీకులకు మరో ఝలక్ ఇచ్చింది టీఎస్ఆర్టీసీ. జనరల్, ఎన్జీఓల బస్పాస్ ధరలను భారీగా పెంచింది. వచ్చేనెల ఏప్రిల్ 1 నుంచి ధరలు అమలవుతాయని స్పష్టం చేసింది.
జనరల్ బస్పాస్ ధరలు ఇలా
జనరల్ ఆర్డినరీ బస్ పాస్ ధర 970 నుంచి 1150కి పెంపునట్లు తెలిపింది. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ ధర 1070 నుంచి 1300 చేసినట్లు వెల్లడించింది. ఇక మెట్రో డీలక్స్ ధర 1185 నుంచి 1450కి పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ ధర 1100 నుంచి 1350కి పెంచారు. పుష్పక్ ఏసీ పాస్ ధర గతంలో 2500 ఉండగా.. ప్రజంట్ 3000 కు చేరింది.
ఎన్జీవోల బస్పాస్ ధరలు ఇలా..
ఆర్డినరీ బస్పాస్ – రూ.320 నుంచి రూ.400కి పెంచినట్లు తెలిపింది. మెట్రో ఎక్స్ప్రెస్ బస్పాస్ – రూ.550కి, మెట్రో డీలక్స్ బస్పస్ – రూ.575 నుంచి రూ.700కి పెంచింది.

