రేపు టీఆర్ఎస్ నిరసన దీక్షలు
– నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహణ
– విజయవంతానికి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో రేపు టీఆర్ఎస్ నిరసన దీక్షలను చేపడుతున్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షలను కొనసాగున్నాయి. యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారు ప్రకటించిన యాక్షన్ప్లాన్లో ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. వరి ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో చేపట్టే నిరసన దీక్షలోనియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, రైతు బంధు మండల మరియు గ్రామ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, ఆయా మండలాల పార్టీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు.

