కేటీఆర్‌తో ఢీల్లికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
– కేంద్రం కుట్రలు తిప్పి కొడతాం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు సోమవారం ఢీల్లిలో టీఆర్ఎస్ దర్నా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ దర్నాకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తదితరులు ఢిల్లీకి బయల్దేరారు. ఆదివారం సాయంత్రం శంషాబాద్‌లోని ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి పయనం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఢిల్లీ కుట్రలను తిప్పికొడతామని ఉత్సహాం ప్రదర్శించారు.

