పోలీసు నియామకాల్లో దగా చేయొద్దు
– పాత పద్ధతిలోనే ఉద్యోగాలను భర్తీ చేయాలి
– ఏడు మార్కులు కలిపితేనే అభ్యర్థులకు న్యాయం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె.రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో సర్కారు దగా చేసేందుకు యత్నిస్తున్నట్లుగా ఉందని బీసీ సంక్షేమ సంఘం. జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. పోలీసు నియామకాలలో లాంగ్ జంప్, రన్నింగ్ ఈవెంట్లలో లోపాలు కనిపిస్తున్నాయని, వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్ ను 3.8 మీటర్ల నుంచి 4 మీటర్లకు పెంచారని, దీంతో 50 శాతం మంది అర్హత సాధించలేకపోయారని అన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం ఎంతో మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నారని అన్నారు. 1600/800 వి ఓటర్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తి చేయాలన్నారు. దీంతో పాటు హైకోర్టు తీర్పు మేరకు ప్రిలిమినరిలో 7 మార్కులను కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యుర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలా కాదని ఉద్యోగాలను భర్తీ చేసి దగా చేస్తే సర్కారుకు గుణపాఠం తప్పందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ .కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

