సీఎంఆర్ఎఫ్తో నిరుపేదలకు ఆరోగ్య భరోసా
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం సహాయనిధి(సీఎంఆర్ఎఫ్)తో సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యానికి భరోసా అందిస్తున్నారని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. తాండూరు ప్రాంతానికి చెందిన నాగభూషణం, రాజ్ కుమార్, వెంకటయ్యలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద రూ. 88 వేలను మంజూరు చేసింది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుకు లబ్దిదారులకు ఎల్ఓసీలను అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. సీఎంఆర్ఎఫ్తో నిరుపేద కుటుంబాల వైద్య ఖర్చులకు నిధులు మంజూరు చేసి భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, రాజు గౌడ్, ఈర్షద్, చంటియాదవ్, తదితరులు పాల్గొన్నారు.

