గ‌జం ధ‌ర త‌గ్గించండి..!

తాండూరు వికారాబాద్

గ‌జం ధ‌ర త‌గ్గించండి..!
– రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల వేలంపై వ్యాపారుల అభిప్రాయం
– మ‌నోహ టౌన్‌షిఫ్‌లో 61 ప్లాట్ల విక్ర‌యానికి ఏర్పాట్లు
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులోని అమ్మ‌కానికి వ‌చ్చిన రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల గ‌జం ధ‌ర‌ను త‌గ్గించాల‌ని వ్యాపారులు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం తాండూరు ఎంపీడీఓ కార్యాల‌యంలో తాండూరు ప‌ట్ట‌ణం హైద‌రాబాద్ రోడ్డు మార్గంలోని యాలాల మండ‌ల ప‌రిధిలో ఉన్న రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల వేలం విక్ర‌యాల‌పై తాండూరు స్టోన్ మ‌ర్చంట్స్, క్వారీ అసోసియేష‌న్, ది గ్రైన్ అండ్ సీడ్స్ మ‌ర్చంట్స్ అసోసియేష‌న్ వ్యాపారుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా తాండూరు ఆర్డీఓ కార్యాల‌య డివిజ‌న్ అధికారి మ‌హేష్ గౌడ్‌, స్వ‌గృహ అధికారి శ్రీ‌నివాస్ రెడ్డిలు వ్యాపారుల‌కు అవంగాహ‌న క‌ల్పించారు. జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల ఆదేశాల మేర‌కు తాండూరు ప‌ట్ట‌ణంలోని రాజీవ్ స్వ‌గృహా రెండో విడ‌త ప్లాట్ల వేలం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌నోహా టౌన్‌షిఫ్ ఆధ్వ‌ర్యంలో నిర్మించిన 16 ఓపెన్ ప్లాట్లు, 45 సెమీస్ట్ర‌క్చ‌ర్ ప్లాట్ల‌ను వేలం ప‌ద్ద‌తిలో విక్ర‌యిస్తున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌భుత్వం గ‌జానికి రూ. 10 వేల ధ‌ర‌ను నిర్ణ‌యించింద‌ని పేర్కొన్నారు. ఎలాంటి చిక్కులు లేని ప్లాట్ల‌ను ప్ర‌భుత్వం వేలం ద్వారా విక్ర‌యిస్తుంద‌ని అన్నారు. ఇందుకు వ్యాపారులు మాట్లాడుతూ రాజీవ్ స్వ‌గృహ వ‌ద్ద మార్కెట్ డిమాండ్ అంత‌గా లేద‌ని, గ‌జానికి రూ. 10 వేలు నిర్దారించిన ధ‌ర‌ను త‌గ్గిస్తే వ్యాపారులు ముంద‌కు వ‌స్తార‌ని అధికారుల‌కు తెలిపారు. దీనికి మీరే జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకెళ్లాల‌ని అధికారులు వ్యాపారుల‌కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీఓ ర‌త‌న్ సింగ్‌, రెవెన్యూ అధికారి రాజీరెడ్డి, ఆయా సంఘాల వ్యాపారులు పాల్గొన్నారు.