టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభకు తరలిన జర్నలిస్టులు

తాండూరు వికారాబాద్

టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభకు తరలిన జర్నలిస్టులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం(టీయూడబ్ల్యూజే) – ఐజేయూ వికారాబాద్ జిల్లా మహాసభకు తాండూరు జర్నలిస్టులు తరలివెళ్లారు. బుధవారం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, తాండూరు నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శి పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి, డి. రామకృష్ణల ఆధ్వర్యంలో తాండూరు నుంచి పెద్ద ఎత్తున బయలుదేరారు. నియోజకవర్గంలోని తాండూరు, తాండూరు పట్టణం, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల నుంచి జర్నలిస్టులు మహాసభకు వెళ్లారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులతో పాటు సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే(ఐజేయూ) తరపున ఐక్యంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘం జర్నలిస్టులు ఉన్నారు.